నెల్లూరు టీడీపీ ఎంపీ టికెట్టా మాకొద్దు బాబోయ్..

నెల్లూరులో టీడీపీ ఎంపీగా నిలబడడానికి ఆ పార్టీ తరుపున ఎవరు ముందుకు రావట్లేదు అని సమాచారం.
నెల్లూరులో తెలుగుదేశం పార్టీ పుట్టిన తర్వాత కేవలం 1999లో మాత్రమే అక్కడ పార్లమెంట్ స్థానాన్ని గెలిచింది.

భయపడుతున్నారా జాగ్రత్తపడుతున్నారా

రాబోయే సార్వత్రిక ఎన్నికలలో నెల్లూరు పార్లమెంట్ స్థానం నుండి టీడీపీ తరుపున పోటీ చేయడానికి అభ్యర్థిగా ఎవరు ముందుకు రావట్లేదు అంట.. అధినేత అడిగితే అందరూ ఒకరిమీద ఒకరు చెప్పుకుంటున్నారు అంటా.

ఓటమి భయం వెంటాడుతోందా!

నెల్లూరు జిల్లాకి సంబందించిన టీడీపీ నాయకులకు పార్లమెంట్ కి పోటీ చేస్తే గెలుస్తాం అనే భావన ఎక్కడా లేదు అనేది అక్కడి క్యాడర్ లో ఉన్న చర్చగా తెలుస్తుంది. యువగలం పాదయాత్ర జరుగుతున్న సందర్భంలో టిక్కెట్ల అంశం గురించి లోకేష్ మాట్లాడుతూ మూడు సార్లు కంటే ఎక్కువగా ఓడిపోయిన వాళ్లకు మల్లి టికెట్ ఇవ్వము అని చెప్పిన విషయాన్నికారణంగా చూపిస్తూ జిల్లా నేతలు అందరు సోమిరెడ్డిని ఎంపీ అభ్యర్థిగా నిలబెట్టమని అధిష్టానానికి చెప్పారు అంట కానీ సోమిరెడ్డి మాత్రం తాను సర్వేపల్లి నుంచే MLA అభ్యర్థిగా బరిలో ఉంటాను టికెట్ గురించి అవసరమైతే చంద్రబాబుతోనే తేల్చుకుంటాను అని చెప్తున్నారు అంటా.


ఒకవేళ సోమిరెడ్డి కాకపోతే ఉదయగిరి మాజీ MLA బొల్లినేనిని రంగంలోకి దింపాలని టీడీపీ అధినాయకత్వం ఆయనను సంప్రదించి మీకు దేశవ్యాప్తంగా వ్యాపారాలు ఉన్నాయి కాబట్టి మీరు MLA గా కంటే ఎంపీగా అయితేనే మీకు మీ వ్యాపారాలకు బాగుంటుంది అంటూ ఒప్పించే ప్రయత్నం చేయగా ఆయన కూడా నిరాకరించినట్టు సమాచారం. ఆ తర్వాత సీనియర్ నేత ఆనం రామనారాయణరెడ్డిని కూడా అడిగి చూడగా అక్కడ కూడా అదే మాదిరి సమాధానం రావడంతో టీడీపీ అధినాయకత్వం ఇక్కడ ఎంపీ అభ్యర్థిగా ఎవరిని పోటీలోకి దింపాలో అర్థం కాక తల పట్టుకుంటుందంటా చూడాలి చివరకు ఇక్కడ బలవ్వబోయే వ్యక్తి ఎవరో!

Leave a Comment