గుంటూరు వెస్ట్ లో విడదల రజనీ విజయవంతం అవుతుందా?

మంత్రి విడదల రజిని గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో బలంగా దూసుకుపోతున్నారు!

తొలిసారి చిలకలూరిపేట నుంచి పోటీ చేసిన ఆమె సిట్టింగ్ మంత్రి సీనియర్ తెలుగుదేశం నాయకుడు ప్రత్తిపాటి పుల్లారావు పై విజయం సాధించారు.రెండవసారి చేసిన మంత్రివర్గ విస్తరణలో అనూహ్యంగా మంత్రి పదవి కూడా దక్కించుకున్నారు. కానీ ఇప్పుడు జగన్ ఆమెకు స్థానచలనం కల్పించడంతో మొదట్లో కొంచెం ఇబ్బంది పడ్డారని సమాచారం ఎందుకంటే ఆమెను మార్చిన గుంటూరు వెస్ట్ సీటు తెలుగుదేశంకు కంచుకోట లాంటి సీటు 2019 ఎన్నికలలో విపరీతమైన జగన్ ప్రభంజనంలోనూ ఇక్కడ టీడీపీ 4000లకు పైగా మెజారిటీతో గెలిచింది కానీ తర్వాత ఆ MLA వైసీపీ పంచన చేరారు ఆమెను ఇక్కడకు మార్చిన నేపథ్యంలో అక్కడి స్థానిక నేతలు ఆమెకు సరిగా సహకరించని నేపథ్యంలో ఓడిపోతానేమో అనే ఆందోళనలో విడదల రజని ఉన్నట్టు సమాచారం.

పరిస్థితులు అన్నీ అనుకూలంగా మార్చుకుంటున్నారా ..

ఆమెకు గుంటూరులో గెలుపు అనేది అంత తేలికైన విషయమేమి కాదు ఈ విషయం రజనికి కూడా బాగా తెలుసు
అందుకే ఆమె అంది వచ్చిన ప్రతి అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకుంటున్నారు అని ఆ నియోజకవర్గ ప్రజలు చెప్పుకుంటున్నారు. స్థానికంగా ఉన్న ప్రతి వైసీపీ నాయకులను కలుపుకుపోతూ ప్రతి రోజు నియోజకవర్గంలో ఎదో ఒక ప్రోగ్రాము ఏర్పాటు చేసుకుంటూ నిత్యం ఆమె ప్రజల్లో ఉండేలా చేసుకుంటున్నారు.

అయోమయంలో ప్రతిపక్షాలు!

ఇది తెలుగుదేశానికి బలమైన స్థానమే అయినప్పటికీ ఇక్కడనుంచి ఎవరు పోటీలో ఉంటారు అనేది తెలియక క్యాడర్ సతమతమవుతున్నారు అంటా మేము అంటే మేము అంటూ డజనుకు పైగా అభ్యర్థులు ఇక్కడ నుండి పోటీకి సిద్ధంగా ఉన్నారు అంటా ఒకవైపు అన్నివిధాలా బలమైన అభ్యర్థిగా విడదల రజని ప్రచారంలో దూసుకుపోతుంటే ప్రతిపక్ష పార్టీలు మాత్రం ఇంకా కనీసం అభ్యర్థినే నియమించకపోవడం తెలుగుదేశం మరియు జనసేన శ్రేణులను కలవరపెడుతున్నాయి అంటా.

చూద్దాం ఇక్కడ రజని సక్సెస్ ఎంతమేరకు ఉంటుందో!

Leave a Comment