వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మైండ్ గేమ్ లో విపక్షం చిక్కుతుందా…!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2024 ఎన్నికలకు ఇంకా కొన్ని నెలల సమయం ఉన్నప్పటికీ, అధికార వైసీపీ మరియు ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ మరియు జనసేన పార్టీ (కూటమి) మధ్య పోటీ మొదలైపోయింది. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తన ప్రత్యర్థులను ఒకరినొకరు దెబ్బతీసుకోవడానికి ప్రేరేపించడం ద్వారా విపక్షాన్ని బలహీనపరచడానికి ప్రయత్నిస్తున్నారని కొందరు రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

జగన్మోహన్ రెడ్డి తన పార్టీలోని అసంతృప్త నాయకులను తొలగించడానికి ముందుగానే వారికి టికెట్లు ఇవ్వలేనని చెప్పే టికెట్లు నిరాకరిస్తున్నారు. దీంతో వైసీపీ నుంచి టికెట్లు దక్కని నాయకులు టీడీపీకి లేదా జనసేనకు వెళ్లడం ప్రారంభించారు. ఈ నాయకులను చేర్చుకోవడం ద్వారా టీడీపీ మరియు జనసేన తమ బలాన్ని పెంచుకోవాలనుకుంటున్నాయి వారి చేరిక నిజంగానే బలమా లేదా అనేది పక్కన పెడితే ఇక్కడ కొసమెరుపు ఏంటంటే వైసీపీ ఆసంతృప్త నాయకులను కూటమి పార్టీల్లో చేర్చుకుని ఇప్పటివరకు ఆ వైసీపీ నాయకులకు వ్యతిరేకంగా జెండా మోస్తూ పనిచేసిన తమ తమ నాయకులను కార్యకర్తలకు ఎలా సర్దిచెపుతారు అనేది పెద్ద టాస్క్!

అయితే, వైసీపీ అధినేత ఈ పరిణామాలను ఊహించినట్లు కనిపిస్తోంది. వైసీపీ తన టికెట్ల కసరత్తును వేగంగా పూర్తి చేస్తోంది. దీంతో టీడీపీ మరియు జనసేన విపక్ష నాయకులను చేర్చుకోవడానికి తగినంత సమయం దొరకకపోవచ్చని విశ్లేషకులు అంటున్నారు.

వైసీపీ నుంచి వచ్చిన నాయకులందరూ విపక్షానికి ప్రయోజనం చేకూరుస్తారని అనుకోలేము . కొంతమంది నాయకులు తాము ఆశించినట్టు జరగకపోతే విపక్షంలో కూడా అసంతృప్తిని సృష్టించే అవకాశం ఉంది.

ఈ పరిస్థితుల్లో, వైసీపీ మైండ్ గేమ్‌లో విపక్షం చిక్కుతుందా లేదా అనేది చూడాలి.

Leave a Comment