పల్నాడు లో టీడీపీకి షాక్ పార్టీ వీడిని ప్రముఖ నేత

తెదేపాను వీడిన రాయపాటి కుటుంబం కారణం కన్నా..లక్ష్మీ నారాయణేనా!

ఆగర్భ శత్రువైన కన్నాను తెదేపాలో చేర్చుకోవడం పట్ల ఆనాడే కినుక వహించిన రాయపాటి.సత్తెనపల్లి సీటు ఆసించి భంగపాటు. ఇటీవల అభ్యర్థి కన్నానేనని ప్రచారం జరగటంతో భగ్గుమన్న రాయపాటి కుటుంబం.

మరోవైపు కోడెల శివరాంతోను కన్నాకు తప్పని తిప్పలు.

రాయపాటి, కోడెల రెండు ఉద్దండుల కుటుంబాల మధ్య కన్నా సత్తెనపల్లిని వీడుతాడా..ఓడిపోతాడా ?

రాజకీయ ఉద్దండులైన రాయపాటి సోదరుల కుటుంబానికి.. సత్తెనపల్లికి విడదీయరాని అనుబంధం ఉంది. సుదీర్ఘకాలంగా ఈ నియోజకవర్గంలో ప్రతి గ్రామంలోనూ వారికి పట్టు ఉంది. వారు ఆదేశిస్తే ఏం చేసేందుకైనా సిద్ధంగా ఉండే సైన్యంవారికుంది. అందుకే వారు ఏ పార్టీలో ఉన్నా సునాయాసంగా, ప్రశాంతంగా తమకున్న అనుచరులతో, నమ్మకమైన నాయకులతో పోల్ మేనేజ్మెంట్ చేయించుకోవటంలో వారుదిట్ట . ఇటీవల వారు సత్తెనపల్లి నియోజకవర్గ సీటు రాయపాటి కుటుంబంలో ఒకరికి ఆశించారు. అయితే అనూహ్యంగా తమ ఆగర్భ శత్రువైన కన్నా లక్ష్మీనారాయణను రాయపాటి కుటుంబంతో చర్చించకుండా, వారి ప్రమేయం లేకుండా తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు చేర్చుకోవడం పట్ల తీవ్ర వ్యతిరేకతను వ్యక్తం చేశారు. ఆనక కినుక వహించారు.

చంద్రబాబు చిత్రపటాలను నేలకేసి విసిరిన రంగబాబు

ఎన్నికల సమయం దగ్గర పడడంతో కన్నా లక్ష్మీనారాయణ తొందరపడి సత్తెనపల్లి అభ్యర్థి తానేనని ప్రకటింపజేయుంచుకున్నాడు. దీంతో సీటు ఆశించి భంగపడిన రాయపాటి కుటుంబం భగ్గుమంది. రాయపాటి రంగబాబు ఒక అడుగు ముందుకేసి తమ కార్యాలయంలోని చంద్రబాబు చిత్రపటాలను నేలకేసి విసిరి తన ఆక్రోషాన్ని, ఆవేదనను బయటపెట్టారు. ఈ పరిస్థితుల్లో రాయపాటి కుటుంబం తీసుకునే రాజకీయ నిర్ణయాల పట్ల ఆసక్తికర చర్చ జరుగుతోంది. తమ ఆగర్భ శత్రువైన కన్నా లక్ష్మీనారాయణ ఓటమికి వారు అంతర్లీనంగా, క్రియాశీలకంగా పనిచేసే అవకాశం ఉందని పలువురు చర్చించుకుంటున్నారు.

ఇంకోవైపు కోడెల శివరామకృష్ణ కూడా కన్నాకు తలనొప్పిగా మారాడు. కన్నా పక్కన ఉన్నదంతా బ్రోకర్లు, జోకర్లు అంటూ నిప్పులు చెరుగుతున్నాడు. *మొత్తంమీద కోడెల, రాయపాటి లాంటి రెండు రాజకీయ ఉద్దండుల కుటుంబాల మధ్య విలువలకు తిలోదాకాలిచ్చిన లక్ష్మీనారాయణ సత్తెనపల్లి లో నిలబడటం సాధ్యమేనా.? తెదేపా సమాజిక వర్గం దూరంగా ఉంటే కన్నా గెలవటం సులువేనా? ఆ రెండు కుటుంబాల అడకత్తెర “కన్నం” లో ఇరుక్కుని ఊపిరాడక కన్నా సత్తెనపల్లిని వీడుతాడా..ఓడిపోతాడా తేలాల్సి ఉందని పలువురు చర్చించుకుంటున్నారు.

Leave a Comment