ఉమ్మడి కృష్ణ జిల్లా మైలవరం వైకాపా శాసనసభ్యుడు వసంత కృష్ణ ప్రసాద్ వ్యవహార శైలి ఇప్పుడు జిల్లాలో చర్చనీయాంశంగా ఉంది. ఆయన అతి త్వరలో టీడీపీలోకి వెళ్తారు అంటూ ప్రచారం జరుగుతుంది ఆ ప్రచారాన్ని ఆయన ఖండించకపోగా ఫిబ్రవరి 4వ తారీఖున అన్ని విషయాలు చెప్తా అనడం ఈ వార్తలకు బలం చేకూరుస్తుంది.
జోగి రమేష్ కారణమా!
ఆయన పార్టీ వీడడానికి ప్రధాన కారణం మంత్రి జోగి రమేష్ వ్యవహారశైలి అని తెలుస్తుంది. 2019లో పట్టుబట్టి మరి దేవినేని ఉమా మీద పోటీ చేయడానికి టికెట్ సాధించుకుని ఉమా మీద గెలిచిన చరిత్ర వసంత కృష్ణ ప్రసాద్ ది జోగి రమేష్ మంత్రి అయ్యాక తన నియోజకవర్గమైన పెడన తో పాటు మైలవరం నియోజకవర్గంలో కూడా ఆయన తన కార్యకలాపాలు కొనసాగించారు ఈ విషయాన్ని జీర్ణించుకోలేని వసంత బహిరంగంగానే తీవ్రంగా వ్యతిరేకించారు కూడా.
అధిష్టానం పట్టించుకోలేదని అలక!
ఈ విషయాన్ని ఆయన పార్టీ పెద్దల దృష్టికి కూడా తీసుకెళ్లారు పార్టీ అధిష్టానం కూడా ఒకసారి ఈ విషయమై ఇద్దరినీ పిలిపించి మాట్లాడింది అంతటితో ఈ సమస్య సమసిపోతుంది అని అందరు భావించారు కానీ అక్కడే అసలైన రచ్చ మొదలైంది అధిష్టానం చెప్పాక కూడా జోగి రమేష్ తన జోక్యాన్ని మైలవరం నియోజకవర్గం లో తగ్గించలేదు.
అప్పటినుండి పార్టీతో అంటీముంటనట్టు ఉంటున్నారు వసంత. ఒక దశలో తాను రాజకీయాలనుండి తప్పుకుంటున్నట్టు కూడా ప్రకటన చేశారు . ఆ ప్రకటన తర్వాత ముఖ్యమంత్రి జగన్ ఆయనను పిలిపించుకుని మాట్లాడడంతో సద్దుమణిగారు
మళ్ళీ మైలవరంలో పోటీ చెయ్యాలి అనుకోవట్లేదు అంటూనే తన పోటీ గురించి అధిష్టానమే నిర్ణయిస్తుంది అంటూ తికమక ప్రకటనలు ఇస్తూ వస్తున్నారు.
దీని మీద క్లారిటీ కావాలని మీడియా కోరగా నర్మగర్భంగా నవ్వేసి అన్ని త్వరలో తేలుతాయి అంటూ సమాధానం ఇచ్చారు
ఇదిలా ఉండగా 3వ తారీఖున దెందులూరులో జరగనున్న సిద్ధం సభకు తాను రాలేను అని ఆయన పార్టీ పెద్దలకు సమాచారం ఇచ్చారు నియోజకవర్గంలో మాత్రం ఆయన టీడీపీలోకి వెళ్తున్నారు అంటూ చెప్పుకుంటున్నారు.
దీని మీద క్లారిటీ రావాలంటే కొద్దీ రోజులు ఆగాల్సిందే!!!!!!