అనకాపల్లి కూటమి ఎంపీ సీట్ వెరీ హాట్!

అనకాపల్లి టీడీపీ ఎంపీ టికెట్ వ్యవహారం చాలా హాట్ హాట్ గా ఉంది ఇక్కడ నుండి పోటీకి టీడీపీ సీనియర్ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడి కుమారుడు విజయ్ తనకే కావాలని గడిచిన మూడేళ్లుగా పట్టు పడుతున్నారు తన కొడుక్కి కాకుండా వేరే వాళ్లకు ఇస్తే ఒప్పుకునే ప్రసక్తే లేదు అంటూ పార్టీ అధినాయకత్వానికి బహిరంగంగానే ఆల్టీమేటం ఇచ్చారు ఇంకో వైపు ఇదే టీడీపీ నుండి గంటా శ్రీనివాసరావు ఆశీస్సులతో హైదరాబాద్ కు చెందిన వ్యాపారవేత్త భైరా దిలీప్ చక్రవర్తికి ఇప్పించుకోవడంలో దాదాపుగా సక్సెస్ అయ్యారు అనే చెప్పుకోవచ్చు గడిచిన సవంత్సర కాలంగా దిలీప్ అనకాపల్లి పార్లమెంట్ పరిదిలో పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నార. అధిష్టానం కూడా ఆయన అభ్యర్థిత్వానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని చెప్పుకుంటున్నారు.

అలకబూనిన అయ్యన్నపాత్రుడు!

దిలీప్ కి టికెట్ ఖరారు అయ్యిందన్న వార్తల నేపథ్యంలో అయ్యన్న పాత్రుడు ఆగ్రహావేశాలకు గురవుతున్నారు అంట మొన్న మాడుగులలో జరిగిన చంద్రబాబు రా కదలిరా సభకు దిలీప్ వస్తే కాళ్లు విరగ్గొడతాను అని అయ్యన్న బహిరంగంగానే వాఖ్యానించారు అయ్యన్నకు ఆ ప్రాంతంలో ఉన్న ఆదరణ దృష్ట్యా పార్టీ కూడా దిలీప్ ని రావొద్దు అని చెప్పింది. అయ్యన్నకు పార్టీ అధిష్టానం భయపడడం ఏంటి అని దిలీప్ కాస్త అధిష్టానం మీద అసంతృప్తి వ్యక్తం చేశారు.

జనసేన కూడా పోటీకి సై!

టీడీపీలో పరిస్థితి ఇలా ఉంటే మరో వైపు జనసేన కూడా ఇక్కడినుంచి పోటీ చేయడానికి సిద్ధంగా ఉంది ఉత్తరాంధ్రకు చెందిన సీనియర్ రాజకీయనేత కొణతాల రామకృష్ణ అనకాపల్లి ఎంపీ టికెట్ హామీతోనే జనసేనలో చేరినట్టుగా ఆయన సన్నిహిత వర్గాలు చెప్తున్నాయి. ఈ ఎంపీ టికెట్ కూటమిలో భాగంగా మాకే కావాలని జనసేన కూడా తీవ్రంగా ఒత్తిడి చేస్తుంది.

ఇన్ని పోటీల మధ్య అక్కడనుండి పోటీ చేసే అభ్యర్థి ఎవరో తెలియక కేడర్ తలలు పట్టుకుంటున్నారు అంటా..

Leave a Comment