సీటు కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్న జనసేన నాయకుడు బొర్రా అప్పారావు. బొర్రాకు ఇప్పించే యోచనలో జనసేన అధినేత
బాబు పై ఒత్తిడి తెస్తున్న పవన్ కళ్యాణ్. ఇదిలా ఉండగా నియోజకవర్గంలో కన్నాకు సపోర్ట్ గా పర్యటిస్తున్న తెలుగుదేశం నేతలు కన్నానే రాబోయే ఎన్నికలలో కూటమి అభ్యర్థిగా ప్రకటిస్తున్నారు.
జనసేన ని కించపరిచేలా, అవమానపరిచేలా ఈ చర్య ఉందని బొర్రా పవన్ దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. సత్తెనపల్లి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్చార్జిగా ఉన్న కన్నా లక్ష్మీనారాయణనే అభ్యర్థిగా ప్రకటిస్తున్నట్లు వచ్చిన సమాచారంపై జనసేన నేత బొర్రా వెంకట అప్పారావు వెంటనే అప్రమత్తమయ్యారు. జిల్లా పార్టీ అధ్యక్షులు ఎలా ప్రకటిస్తారని ఆగమేఘాలపై ఈ సమాచారాన్ని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్లారు. పొత్తు సీట్లు ఖరారు కాకముందే ఎలా ప్రకటిస్తారు అంటూ పవన్ పై స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకుల వ్యవహారశైలిపై ఆగ్రహం. పొత్తు ధర్మాన్ని విడిచి సీట్ల కేటాయింపులు తేలకముందే ఇలా ప్రకటించుకోవడం పట్ల జనసేన ఉమ్మడి జిల్లా కమిటీ కూడా మండిపడుతోంది.ఈ విషయం పై స్పందించిన జనసేన అధినేత చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లినట్లు జనసేన నాయకులు పేర్కొంటున్నారు.
మరో వైపు కోడెల శివప్రసాదరావు తనయుడు కోడెల శివరామకృష్ణ కూడా ఈ ప్రకటన పట్ల మండిపడుతున్నారు కోడెల కుటుంబానికి అన్యాయం చేస్తే సహించేది లేదని వారి అనుచరులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అవసరమైతే కోడెల శివరాం ఇండిపెండెంట్ గా పోటీ చేసే ఆలోచనలలో ఉన్నట్టు అంతర్గత సమాచారం.