ముద్రగడకు చిక్కిన పవన్ కల్యాణ్

ఇటు చంద్రబాబు అటు ముద్రగడ పద్మనాభం మధ్యలో పవన్ కల్యాణ్ జనసేనానికి వచ్చిన కష్టం మామూలుది కాదు. అటు చంద్రబాబు పైన తన కసి తీర్చుకొనేందుకు పవన్ కల్యాణ్ ఇప్పుడు ముద్రగడకు అస్త్రంగా మారుతున్నారు. గోదావరి జిల్లాల్లో కాపు ఓటింగ్ తనకే ఉంటుందని నిన్న మొన్నటి వరకు పవన్, చంద్రబాబు లెక్కలు వేసారు. ఇప్పుడు అసలు విషయం బోధపడింది. ముద్రగడ వైసీపీలో చేరుతున్నారనే ప్రచారం తరవాత సర్వేలు చేయించారు. అసలుకే మోసం వస్తుందని గ్రహించారు. వెంటనే ముద్రగడ వద్దకు రాయబారాలు నడిపారు. తనకు వచ్చిన అవకాశం ముద్రగడ ఎందుకు వదులు కుంటారు. అసలైన ఉద్యమ నేత. అంతే, ఇప్పుడు పవన్ కు ఉచ్చు బిగిస్తున్నారు. గోదావరి తీరాన అసలు ఆట మొదలైంది.

ముద్రగడ పద్మనాభావంతో పవన్ దూతలు

ముద్రగడ పద్మనాభావంతో పవన్ దూతలు సమావేశమయ్యారు. జనసేనలో రావాలని ఆహ్వానించారు. కాపులంతా ఐక్యంగా ఉండాలంటూ పవన్ రాసిన లేఖను ప్రస్తావించారు. ముద్రగడ పార్టీలో చేరటం పైన స్పష్టత ఇవ్వకపోయినా సానుకూలంగా స్పందించారు. ఆ వెంటనే టీడీపీ నుంచి జ్యోతుల నెహ్రూ రంగంలోకి దిగారు. టీడీపీలో చేరాలంటూ ముద్రగడను ఆహ్వానించారు. ఇంతలో ముద్రగడ కుమారుడు గిరిబాబు సీన్ లోకి వచ్చారు. తాము జనసేనలో చేరేందుకు సిద్దమనే సంకేతాలు ఇచ్చారు. కాకినాడ పార్లమెంట్ తో పాటుగా రెండు అసెంబ్లీ స్థానాలు కోరుతున్నట్లు చెప్పారు. ఇక త్వరలో ముద్రగడతో పవన్ సమావేశం అవుతారని తెలుస్తోంది.

కాపు సీఎం కావాలి!

పవన్ సమావేశమైన సమయంలో ముద్రగడ ఒకే విషయం స్పష్టం చేయనున్నారు అది కాపు సీఎం కావాలి అని. అందు కోసం ఏం చెప్పినా చేయటానికి సిద్దమని ముద్రగడ తేల్చనున్నారు.

పవన్ కు ఊహించని ట్విస్ట్

ముద్రగడ వైసీపీలోకి వెళ్లకుండా అడ్డుకోవటమే ముఖ్యమని భావించిన పవన్ కు ఊహించని ట్విస్ట్ ముద్రగడ నుంచి ఎదురుకావటం ఖాయం. టీడీపీతో పొత్తులో కొనసాగాలంటే 50 తక్కువ కాకుండీ సీట్లు తీసుకోవాలి, అధికారంలో వాటా ఇవ్వాలనేది ముద్రగడ ప్రధాన షరతుగా ఉండనుంది. ఇందుకు పవన్ అంగీకరిస్తే ముద్రగడ జనసేనలో చేరటం ఖాయం. ఏ సీటు ఇచ్చినా పోటీ చేయటానికి సిద్దంగా ఉంటారు. కాపు సీఎం పైన తేల్చాలి. సీట్ల పైన స్పష్టత రావాలి. దీనికి భిన్నంగా పవన్ నుంచి స్పందన ఉంటే ముద్రగడ చేరిక అనేది ప్రచారానికే పరిమితం అయ్యే అవకాశాలు ఉన్నాయి.

అదే సమయంలో గోదావరి జిల్లాల్లో కాపులు , ఇతర వర్గాల మధ్య సమీకరణాలు మారే అవాకాశాలు ఉంటాయి. అంతిమంగా ఇది ఎవరికి లాభం చేస్తుంది. లెక్క అర్దమైంది కదా…

Leave a Comment