పరిటాల రవీంద్ర తనయుడు పరిటాల శ్రీరామ్ తన రాజకీయ భవిష్యత్ గురించి ఆందోళనలో ఉన్నారు. 2019లో రాప్తాడు అసెంబ్లీకి పోటీ చేయడం ద్వారా రాజకీయ అరగ్రేటం చేసిన శ్రీరామ్ ఆ తర్వాత అధిష్టానం ఆదేశాలకు అనుగుణంగా ధర్మవరం టీడీపీ ఇంచార్జ్ గా ఉన్నారు.
ధర్మవరం టీడీపీలో వరదాపురం సూరి ప్రకంపనలు
ఇప్పుడు ధర్మవరంలో గోనుగుంట్ల సూర్యనారాయణ అలియాస్ వరదాపురం సూరి వ్యవహారశైలి ప్రకంపనలు సృష్టిస్తుంది
ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో ప్రస్తుతం బీజేపీలో ఉన్న సూరి చూపు తెలుగుదేశం వైపు మళ్లుతుందంట రాబోయే ఎలక్షన్లలో పార్టీ ఏదైనా సరే కేతిరెడ్డికి ప్రత్యర్థిగా ధర్మవరంలో పోటీ చేసేది నేనే అని సూరి తన సన్నిహితుల వద్ద చెప్తున్నారు
వీలైతే టీడీపీ నుండి లేదంటే పొత్తులో భాగంగా బిజెపి నుండి పోటీలో ఉంటా అని ఘంటాపథంగా చెప్తున్నారు అంట
ఇలా జరిగే పరిస్థితుల్లో పరిటాల శ్రీరామ్ పోటీపై ఆయన అభిమానుల్లో ఆందోళన కొనసాగుతుంది.
కుటుంబానికి ఒకటే టికెట్ నిబంధన కూడా..
ఈ పరిస్థితుల్లో కుటుంబానికి ఒకటే టికెట్ అంటూ టీడీపీ అధినాయకత్వం స్పష్టం చేసిన నేపథ్యంలో పరిటాల కుటుంబంలో కూడా ఒకరికే ఇస్తాం అని ఖరాఖండిగా పార్టీ చెప్పిందట ఇప్పడు కొత్తగా వచ్చిన ఈ నిబంధన కూడా పరిటాల వర్గీయులను గందరగోళానికి గురిచేస్తుంది.
పోటీలో ఉండబోయే పరిటాల కుటుంబ సభ్యులు ఎవరో?
ఇప్పుడున్న పరిస్థితుల్లో పరిటాల కుటుంబం నుండి ఇద్దరు పోటీ చేయడం అనేది దాదాపుగా అసాధ్యం గా కనిపిస్తున్న తరుణంలో
పోటీలో సునీత ఉంటారా లేక ఆమె తన కొడుకు రాజకీయ భవిష్యత్ కోసం తనే తన సీట్ త్యాగం చేసి కొడుకుకి ఇస్తారా అనేది కాలమే నిర్ణయిస్తుంది.