రాజ్యసభ బరిలో తెలుగుదేశం పార్టీ!

2024 ఏప్రిల్ లో ఆంధ్రప్రదేశ్ కి సంబందించిన మూడు రాజ్యసభ స్థానాలు ఖాళి కానున్నాయి

  1. సీఎం రమేష్ – బీజేపీ
  2. కనకమేడల రవీంద్ర కుమార్ – టీడీపీ
  3. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి – వైసీపీ

ఈ మూడు స్థానాలకు మార్చిలోనే ఎన్నికలు జరగనున్నాయి

సంఖ్యాబలం ప్రకారంగా చూసుకుంటే ఈ మూడు స్థానాలు వైసీపీ కైవసం చేసుకోవడం లాంఛనమే! ఎందుకంటే ఒక రాజ్యసభ సభ్యుని ఎన్నుకోవడానికి కనీసం 44 మంది శాసనసభ్యల మద్దతు ఉండాలి కానీ తెలుగుదేశం పార్టీకి ఇప్పుడు 23 మంది సభ్యులు మాత్రమే ఉన్నారు ఒకవేళ వైసీపీ లో సీట్ దక్కని వాళ్ళు ఎవరైనా ఒక 10 మంది టీడీపీలో చేరిన అది రాజ్యసభ సభ్యుని ఎన్నుకోవడానికి సరిపోదు.

MLC ఎన్నికల మాదిరి చేసేలా ప్లాం చేస్తున్నారా!

2023 మార్చిలో ఆంధ్రప్రదేశ్ లో జరిగిన శాసనమండలి సభ్యుల ఎన్నికలలో తెలుగుదేశం తమకు సరైన సంఖ్యా బలం లేకపోయినా గాని పంచుమర్తి అనురాధను అభ్యర్థిగా నిలబెట్టి వైసీపీలో ఉన్న అసంతృప్త సభ్యులను తమకు అనుకూలంగా మార్చుకొని వారి ద్వారా అనూహ్యంగా ఆ స్థానాన్ని కైవసం చేసుకున్నారు అదే తరహాలో ఇప్పుడు కూడా చేద్దామని పార్టీ అధినాయకత్వం భావిస్తున్నట్టు సమాచారం. రాజ్యసభ ఎన్నికలలో అభ్యర్థిని నిలిపే అంశంలో పార్టీలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి కొంతమంది సీనియర్లు ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టు సమాచారం. వ్యతిరేకించేవారు గతంలో తెలంగాణా శాశనమండలి ఎన్నికల ఉదంతాన్ని గుర్తు చేస్తున్నారు.

ఓటుకి నోటు!

తెలంగాణా MLC ఎన్నికలలో అభ్యర్థిని నిలబెట్టటానికి ఓట్ల కొనుగోలు అంశం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంత కలకలం సృష్టించిందో అందరికి తెలిసిన అంశమే ఆ సమయంలో తీసుకున్న ఆ తప్పుడు నిర్ణయం అప్పుడు తెలుగుదేశం పార్టీతో పాటు ఆంధ్రరాష్ట్ర భవిష్యత్ మీద కూడా ప్రభావం చూపించింది అక్కడ దొంగగా దొరికిన చంద్రబాబు అర్థరాత్రి అక్కడనుండి పారిపోయి ఆంధ్రప్రదేశ్ కరకట్టకు వచ్చారు ఆ ఉదంతం ఇప్పటికి టీడీపీని వెంటాడుతుంది పదేళ్లు ఆంధ్రప్రదేశ్ కి రావాల్సిన హక్కులను తన తప్పిదం వాళ్ళ చంద్రబాబు వదిలేసాడు అనే భావం ప్రజల్లో ఇంకా ఉంది.

ఇప్పుడు మళ్ళీ అలాంటి నిర్ణయమే అవసరమా?

ఎన్నికలు అతిసమీపంలో ఉన్న ఈ సమయంలో కూడా తెలంగాణలో తీసుకున్న అలాంటి తప్పుడు నిర్ణయమే మల్లి తీసుకుని ప్రజల్లో చులకన అవడం అవసరమా అని కొంతమంది సీనియర్ టీడీపీ నాయకులు నెత్తి నోరు కొట్టుకుంటున్నారు అని సమాచారం

Leave a Comment