చంద్రబాబుతో వైఎస్ షర్మిల- జగన్ షాక్!

అధినేత చంద్రబాబును ఏపీ సీఎం జగన్‌ సోదరి, కాంగ్రెస్‌ నేత వైఎస్‌ షర్మిల భేటీ అయ్యారు. హైదరాబాద్‌లోని చంద్రబాబు నివాసానికి వెళ్లిన షర్మిల తన కుమారుడు రాజారెడ్డి వివాహానికి ఆహ్వానించారు. వచ్చే నెల ఫిబ్రవరి 17న వైఎస్‌ రాజారెడ్డి పెళ్లికి కుటుంబ సమేతంగా రావాలని చంద్రబాబును ఆహ్వానించారు.

ఈ భేటీలో ప్రస్తుత రాజకీయపరిస్థితులు కూడా చర్చించినట్టు అంతర్గత సమాచారం!!! ఇక ఆంధ్రప్రదేశ్ లో అన్నకు వ్యతిరేకంగా షర్మిల చంద్రబాబు సారథ్యంలో కాంగ్రెస్ తరుపున ప్రచారం చేస్తారు అని వైసీపీ శ్రేణులు ఆరోపణలు చేస్తున్న తరుణంలో వీరిద్దరి భేటీకి ప్రాధాన్యత నెలకొంది.

భేటీ అనంతరం మీడియాతో మాట్లాడుతూ షర్మిల హాట్‌ కామెంట్స్‌ చేశారు.తన కుమారుడు రాజారెడ్డి వివాహానికి చంద్రబాబు కుటుంబానికి ఆహ్వాన పత్రికను అందజేయాడానికి మాత్రమే తాను ఇక్కడికి వచ్చానని చెప్పారు.వివాహానికి వస్తానని చంద్రబాబు చెప్పారు.గతంలో తమ పెళ్లిళ్లకు తన తండ్రి రాజశేఖర్‌ రెడ్డి అందరినీ ఆహ్వానించారని, ఆ సమయంలో చంద్రబాబు సైతం హాజరై తమను ఆశీర్వదించారని గుర్తు చేశారు.

పరోక్షంగా లోకేష్ కు చురకలు!

తాను ఇటీవల క్రిస్మస్‌ కేకు పంపితే కొందరు తప్పుబట్టారని, ఇంకా కొందరు రాజకీయంగా వాడుకోవడానికి చూశారంటూ పరోక్షంగా లోకేష్ ను ఉద్దేశించి మాట్లాడారు. తాను చంద్రబాబుకి లోకేష్ కే కాదు కేటీఆర్, హరీష్, కవితకు కూడా పంపానని వెల్లడించారు. దీనిలో రాజకీయం చెయ్యాల్సిన అంత అవసరం లేదు అన్నారు.

రాజకీయాలను ప్రజల కోసం చేస్తున్న సర్వీస్‌గా చూడాలని,అంతే గాని ఎవరి స్వార్థం కోసం వారు వాడుకోవడం సరికాదని అన్నారు.

ఇక ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా బాధ్యతలు తీసుకుంటున్నారా అని విలేఖరులు అడగగా కాంగ్రెస్ పార్టీ ఏది ఆదేశిస్తే దానిని తప్పకుండా పాటిస్తానంటూ నర్మగర్భంగా సమాధానమిచ్చారు రాహుల్‌ గాంధీని ప్రధానిని చేసుకోవాలని, రాహుల్‌ ప్రధాని అయితేనే ఈ దేశం బాగుపడుతుందని తెలిపారు.

Leave a Comment