చిరంజీవికి సినిమాల్లో అందరివాడుగా పేరుంది కానీ రాజకీయాలలో దానిని కొనసాగించలేకపోయాడు 2009 ఎన్నికలలో ప్రజారాజ్యం పార్టీ పెట్టి 294 సీట్లలో పోటీచేసిన చిరంజీవి కేవలం 18 స్థానాలకే పరిమితమయ్యారు.
ఆ తరువాత రాజశేఖర్ రెడ్డి అకాల మరణంతో ఆయన కొడుకు జగన్ కాంగ్రెస్ కు దూరమైన నేపథ్యంలో తన ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసి రాజ్యసభ సభ్యత్వం పొంది కేంద్రమంత్రిగా కూడా చేసారు.ఆ తర్వాత జరిగిన రాష్ట్రవిభజన పరిణామాల తర్వాత ఆయన రాజకీయంగా సైలెంట్ గానే ఉన్నారు కాకపోతే కాంగ్రెస్ కి రాజీనామా అయితే చేయలేదు అధికారికంగా.ఇకపోతే చిరంజీవి ఒక సందర్భంలో అన్నట్టుగా రాజకీయాలకు తాను దూరమయ్యాడు కానీ రాజకీయాలు అయితే తనకు దూరం అవ్వలేదు ముఖ్యంగా 2019 ఎన్నికల తర్వాత చిరంజీవి రాజకీయ పున: ప్రవేశం గురించి ఎన్నో రకాల వార్తలు చెక్కర్లు కొట్టాయి.
జనసేనలో చేరుతారు అని ఒకసారి వైసీపీ తరుపున రాజ్యసభ బరిలో ఉంటారు అని ఒకసారి కాంగ్రెస్ నాయకుడు చింతామోహన్ లాంటి వాళ్లు అయితే ఒక అడుగు ముందుకేసి చిరంజీవి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి అంటూ ప్రకటించేశారు కూడా కానీ వీటి మీద ఎక్కడా చిరంజీవి స్పందించలేదు.
చిరుకు పద్మవిభూషణ్ అందుకేనా !!
తాజాగా భాజాపా ప్రభుత్వం చిరంజీవికి పద్మవిభూషణ్ ప్రకటించడంతో ఆయన రాజకీయ ప్రస్థానానికి సంబంధించిన వార్తలు మళ్లీ మొదలయ్యాయి ఆయన అభిమానులను ఆకట్టుకోవడానికే ఈ అత్యున్నత అవార్డు కేంద్రం చిరంజీవికి ప్రకటించింది అనే వాళ్లు కూడా ఉన్నారు.
యూపీ నుండి రాజ్యసభకు
ఇప్పుడు జనసేన తెలుగుదేశం కూటమిలో లుకలుకలు వస్తున్న తరుణంలో వాటిని ఉపయోగించుకునేలా బిజెపి ఉత్తరప్రదేశ్ నుండి చిరంజీవిని రాజ్యసభకు పంపి ఇక్కడ జనసేనతో కలిసి ఎన్నికలకు వెళ్లే విధంగా ప్రయత్నాలు చేస్తుంది అని మీడియా కోడై కూస్తుంది అదే జరిగితే కాపుల ఓట్లు గంపగుత్తుగా తమకే పడతాయి అనేది కమలనాథుల ఆలోచనగా అనుకోవచ్చు.
ఇదైనా నిజమేనా లేదా అన్నింటిలాగే కాలగర్భంలో కలిసిపోయే వార్తేనా అనేది కాలమే నిర్ణయిస్తుంది.