ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన్నా నటించిన పుష్ప2 సినిమాపై అభిమానుల ఆసక్తి భారీగా ఉంది. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో జరుగుతోంది. ఈ సినిమా ఆగష్టు 15న రిలీజ్ కానుంది. అయితే, షూటింగ్ ఇంకా పూర్తి కాలేదు. దీంతో, రిలీజ్‌కు సమయం సరిపోతుందా అనే ప్రశ్న మెదులుతోంది.
పుష్ప2 సినిమా షూటింగ్ చాలా నెమ్మదిగా జరుగుతోంది. సుకుమార్ ప్రతి సీన్‌లో పెర్ఫెక్షన్ చూసుకుంటున్నారు. దీంతో షూటింగ్ లేట్ అవుతోంది. అయితే, మెజారిటీ షూటింగ్ ఇప్పటికే పూర్తి అయినట్లు తెలుస్తోంది.
షూటింగ్ తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా మే లోపు కంప్లీట్ చేయాలని సుకుమార్ టార్గెట్ పెట్టుకున్నారు. అప్పటికి కంప్లీట్ చేస్తే, తరువాత మూడు నెలలు సినిమా ప్రమోషన్స్, మార్కెట్ పై ఫోకస్ చేయడానికి అవుతుందని భావిస్తున్నారు. అందుకే గ్యాప్ లేకుండా షూటింగ్ పెట్టాలని ఫిక్స్ అయ్యారు.
ఈ సినిమాలో కీలక పాత్ర చేస్తున్న కేశవ అరెస్ట్ కావడంతో, దానికోసం ప్రత్యామ్నాయం ఇప్పటికే సుకుమార్ ఆలోచించారంట. కథకి ఎలాంటి డిస్టర్బ్ లేకుండా కొన్ని చేంజ్ చేసి షూటింగ్ కొనసాగించే పనిలో ఉన్నారనే టాక్ నడుస్తోంది.
ఏది ఏమైనా, సుకుమార్ ఈ సారి పుష్ప2 తో టాలీవుడ్‌కి మరో వెయ్యికోట్ల మూవీ ఇవ్వాలని బలంగా ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. మరి ఇది ఎంత వరకు సాధ్యం అవుతుందనేది చూడాలి.
పుష్ప2 సినిమాలో ఇంకా కొన్ని ముఖ్యమైన సన్నివేశాలు షూట్ చేయాల్సి ఉంది. అలాగే, పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా చేయాల్సి ఉంది. ఈ పనులన్నీ మే లోపు పూర్తి చేయాలని సుకుమార్ టార్గెట్ పెట్టుకున్నారు. ప్రస్తుతం షూటింగ్ చాలా వేగంగా జరుగుతోంది. అయితే, పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఎంత సమయం తీసుకుంటాయో చూడాలి.
షూటింగ్ పూర్తి చేయడానికి సమయం సరిపోతుందా అనేది ఖచ్చితంగా చెప్పలేము. అయితే, సుకుమార్ తన టార్గెట్‌ని చేరుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారని భావించవచ్చు.
మేమంతా సిద్ధం బస్సు యాత్రలో ఉన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై ఒక ఆగంతకుడు హత్యాయత్నానికి తెగబడ్డాడు. యాత్రలో భాగంగా శనివారం…
The wheels of progress are turning as Tesla, the global electric vehicle (EV) major, considers Andhra…
సొంత ఇల్లు నాకల.. ఈ రోజుతో నెరవేరిందంటూ కళ్లమ్మట వెలుగులతో, గుండె నిండా సంతోషంతో మాట్లాడిన గీతాంజలి అనే ఈ…
ఏ పార్టీలోనైనా పదవులు, ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్స్ ఇవ్వకపోతే పార్టీకి రాజీనామాలు చేసి వెళ్ళిపోతుంటారు. కానీ వైసీపిలో పదవులు,…
జనసేన అధినేత పవన్ కల్యాణ్ విశాఖ పర్యటన ఖరారు అయింది. రెండు రోజుల (ఆదివారం, సోమవారం) పాటు పవన్ విశాఖలో…
ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులు తమ ఉద్యమ భవిష్యత్ కార్యాచరణను ప్రకటించిన వేళ.. వారికి తీపి కబురు అందింది. వారి డిమాండ్లపై…