Categories: Political Updates

తెలుగుదేశం పార్టీ తొలి జాబితా సిద్ధం చంద్రబాబు మార్కు ఎంపిక ఎవరక్కడ లిస్టులో ?

వచ్చే ఎన్నికల కోసం టీడీపీ అధినేత చంద్రబాబు అభ్యర్దుల కసరత్తు వేగవంతం చేసారు. జనసేనకు కేటాయించే సీట్ల పైన ఒక అంచనాకు వచ్చారు. సంక్రాంతి సమయంలో సీట్ల సర్దుబాటు పైన అధికారికంగా ప్రకటన చేయనున్నారు.

పొత్తులో జనసేనకు కేటాయించే సీట్లను మినహాయించి మిగిలిన నియోజకవర్గాల్లో తమ అభ్యర్దులను ఖరారు చేస్తున్నారు. దాదాపు 60 పేర్లతో తొలి జాబితా ప్రకటకు సిద్దం అవుతున్నారు. బీజేపీతో పొత్తుపైన ఈలోగానే నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది.

ఎవరెక్కడ నుంచి :

వచ్చే ఎన్నికలు టీడీపీకి, వ్యక్తిగతంగా చంద్రబాబుకు ప్రతిష్ఠాత్మకంగా మారుతున్నాయి. దీంతో, ఆచితూచి జనసేనకు సీట్ల కేటాయింపు..అభ్యర్దుల ఎంపిక విషచంలో చంద్రబాబు నిర్ణయాలు తీసుకుంటున్నారు. పార్టీ వర్గాల సమాచారం మేరకు తొలి జాబితాలో పేర్లు సిద్దమయ్యాయి. ఇచ్ఛాపురం – బెందాళం అశోక్, టెక్కలి – అచ్చెనాయుడు, ఆముదాలవలస – కూన రవికుమార్. పలాస – గౌతు శిరీష, రాజం – కొండ్రు మురళీ మోహన్, బొబ్బిలి – బేబీ నాయన. విజయనగరం – అశోక్ గజపతి రాజు చీపురుపల్లి – కిమిడి నాగర్జున, కురుపాం – టి.జగదీశ్వరి, పార్వతి పురం – బి. విజయచంద్ర, వైజాగ్ (తూర్పు) – వెలగపూడి రామకృష్ణబాబు, వైజాగ్ (పశ్చిమ) – గణబాబు. పాయకరావుపేట – అనిత, నర్సీపట్నం – చింతకాయల విజయ్, తుని-యనమల దివ్య, జగ్గంపేట – జ్యోతుల నెహ్రూ, పెద్దాపురం – చినరాజప్ప, అనపర్తి – నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి, రాజమండ్రి (అర్బన్) – ఆదిరెడ్డి వాసు, గోపాలపురం – మద్దిపాటి వెంకట్రాజు, ముమ్మడివరం – దాట్ల సుబ్బరాజు, అమలాపురం – బత్తుల ఆనందరావు, మండపేట – వేగుళ్ల జోగేశ్వరరావు, పేర్లు తొలి జాబితాలో ఉన్నట్లు తెలుస్తోంది.

సీనియర్లకు ప్రాధాన్యత :

వీరితో పాటుగా.. ఆచంట – పితాని సత్యనారాయణ, పాలకొల్లు – నిమ్మల రామానాయుడు, ఉండి – మంతెన రామరాజు, దెందులూరు -చింతమనేని ప్రభాకర్, విజయవాడ ఈస్ట్- గద్దె రామ్మోహన్ రావు, విజయవాడ (సెంట్రల్) – బోండా ఉమ,నందిగామ – తంగిరాల సౌమ్య, జగ్గయ్యపేట – శ్రీరామ్ తాతయ్య , మచిలీపట్నం – కొల్లు రవీంద్ర , గన్నవరం – యార్లగడ్డ వెంకట్రావు, పెనమలూరు-బోడె ప్రసాద్, మంగళగిరి-నారా లోకేష్ , పొన్నూరు-ధూళిపాళ్ల నరేంద్ర, చిలకలూరిపేట – పత్తిపాటి పుల్లారావు, సత్తెనపల్లి – కన్నా లక్ష్మీ నారాయణ , వినుకొండ – జివి ఆంజనేయులు, గురజాల – యరపతినేని శ్రీనివాసరావు, మాచర్ల – జూలకంటి బ్రహ్మానందరెడ్డి, వేమూరు – నక్కా ఆనందబాబు, పర్చూరు – ఏలూరి సాంబశివరావు ,ఒంగోలు – దామెచర్ల జనార్దన్, కొండేపు – శ్రీ బాల వీరాంజనేయ స్వామి, కనిగిరి – ఉగ్ర నరసింహా రెడ్డి, కోవూరు – పోలంరెడ్డి దినేష్ రెడ్డి, ఆత్మకూరు – ఆనం రామనారాయణ రెడ్డి, నెల్లూరు రూరల్ -కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి, శ్రీ కాళహస్తి – బొజ్జల సుధీర్ రెడ్డి , నగిరి – గాలి భానుప్రకాష్, పలమనేరు – అమర్‌నాథ్ రెడ్డి , పీలేరు – నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి పేర్లు ఖరారైనట్లు సమాచారం.

జాబితా సిద్దం :

ఇక, జమ్మలమడుగు – భూపేష్ రెడ్డి, మైదుకూరు-పుట్టా సుధాకర్, పులివెందల-బీటెక్ రవి, బనగానేపల్లి – బీసీ జనార్దన్ రెడ్డి, పాణ్యం – గౌరు చరితారెడ్డి, కర్నూలు – టీజీ భరత్ , ఎమ్మిగనూరు – బివి జయనాగేశ్వర రెడ్డి, రాప్తాడు – పరిటాల సునీత, ఉరవకొండ – పయ్యావుల కేశవ్, తాడిపత్రి – జేసీ అస్మిత్ రెడ్డి , కల్యాణదుర్గం – ఉమా మహేశ్వర నాయుడు , హిందూపూర్ – నందమూరి బాలకృష్ణ, కదిరి – కందికుంట వెంకట ప్రసాద్ పేర్లు తొలి జాబితాలో ఉంటాయని తెలుస్తోంది. చివిరి నిమిషంలో అనహ్య మార్పులు. బీజేపీతో పొత్తు ఖరారు..బీజేపీ, జనసేన నుంచి ఈ లిస్టులో ఉన్న నియోజకవర్గాల కోసం ఒత్తిడి వస్తే మినహా ఈ నెలాఖరులోనే తమ తొలి జాబితాను విడుదల చేయాలని చంద్రబాబు ఆలోచన చేస్తున్నట్లు సమాచారం.

Recent Posts

సీఎం జగన్‌పై ఆగంతకుడి దాడి!

మేమంతా సిద్ధం బస్సు యాత్రలో ఉన్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై ఒక ఆగంతకుడు హత్యాయత్నానికి తెగబడ్డాడు. యాత్రలో భాగంగా శనివారం…

7 months ago

Exciting News! Tesla’s Green Journey to Andhra Pradesh!

The wheels of progress are turning as Tesla, the global electric vehicle (EV) major, considers Andhra…

7 months ago

Geetanjali: జగనన్న ఇల్లు ఇచ్చాడని సంతోషంగా చెప్పిన ఈ మహిళ చనిపోయిందా.. అసలేం జరిగింది?

సొంత ఇల్లు నాకల.. ఈ రోజుతో నెరవేరిందంటూ కళ్లమ్మట వెలుగులతో, గుండె నిండా సంతోషంతో మాట్లాడిన గీతాంజలి అనే ఈ…

9 months ago

టికెట్స్ పొందినా వాళ్ళు వైసీపికి రాజీనామాలు…దేనికి సంకేతం?

ఏ పార్టీలోనైనా పదవులు, ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్స్ ఇవ్వకపోతే పార్టీకి రాజీనామాలు చేసి వెళ్ళిపోతుంటారు. కానీ వైసీపిలో పదవులు,…

9 months ago

విశాఖలో జనసేనాని రెండు రోజుల పర్యటన

జనసేన అధినేత పవన్ కల్యాణ్ విశాఖ పర్యటన ఖరారు అయింది. రెండు రోజుల (ఆదివారం, సోమవారం) పాటు పవన్ విశాఖలో…

9 months ago

ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్

ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులు తమ ఉద్యమ భవిష్యత్ కార్యాచరణను ప్రకటించిన వేళ.. వారికి తీపి కబురు అందింది. వారి డిమాండ్లపై…

9 months ago