టీడీపీ తన తొలి జాబితాను సంక్రాంతి నాటికి విడుదల చేయనుంది. 20 నుంచి 25 మంది అభ్యర్థులతో సంక్రాంతి నాటికి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తుంది.
ఎటువంటి వివాదాలు లేకుండా , జనసేన కోరుకున్న నియోజకవర్గాలలో మాత్రమే అభ్యర్థులను ఎంపిక చేసి ప్రకటిస్తున్నారని సమాచారం. కుప్పం నుంచి చంద్రబాబు, టెక్కలి నుంచి అచ్చెనాయుడు, మంగళగిరి నుంచి లోకేష్ వంటి పేర్లు తొలి జాబితాలో కనిపించనున్నాయి. రాష్ట్రంలోని మూడు ప్రాంతాలలో అన్ని సామాజిక వర్గాలకు సంబంధించి అభ్యర్థులు ఉండేలా ప్లాన్ చేసినట్లు సమాచారం. అంతర్గతంగా టీడీపీ కసరత్తు పూర్తయిన తర్వాత కొన్ని నియోజకవర్గాలపై పార్టీ అభిప్రాయ సేకరణ జరుగుతుంది. ఆయా నియోజకవర్గాల్లో ఫోన్ ద్వారా సర్వే చేస్తున్నారు. పార్టీ సభ్యులతో ఒక సర్వే, సాధారణ ప్రజలతో మరో సర్వే చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో సర్వే కూడా చేయిస్తున్నారు. పండుగకు ముందు లేదా తర్వాత జాబితా విడుదల అయ్యే అవకాశం ఉంది. షెడ్యూల్ విడుదలైన తర్వాత ఫిబ్రవరిలో మళ్లీ జాబితాలు వెలువడుతాయని సమాచారం.
ప్రస్తుతం చంద్రబాబు నాయుడు రా కదలిరా పేరిట రాష్ట్రవ్యాప్తంగా బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు. 22 పార్లమెంట్ నియోజకవర్గం లోని వేరే అసెంబ్లీ స్థానాల్లో వీటిని నిర్వహిస్తున్నారు. అయితే ఈ కార్యక్రమం ద్వారా అభ్యర్థుల విషయంలో చంద్రబాబు స్పష్టత సంకేతాలు పంపుతున్నారు. ఇప్పటివరకు ఆరు సభలు జరిగాయి. కనిగిరి కి ఉగ్ర నరసింహారెడ్డి, అచంటకు పితాని సత్యనారాయణ, తిరువూరుకు శ్యావల దేవదత్, బొబ్బిలికి బేబీ నాయనా, ఆళ్లగడ్డకు భూమా అఖిలప్రియ, తునికి యనమల దివ్య ఇన్చార్జిలు గా ఉన్నారు. వీరందరూ వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారని చంద్రబాబు సంకేతాలు పంపారు. మిగతా 16 చోట్ల కూడా చంద్రబాబు సభలు నిర్వహించుకున్నారు. అక్కడ ఇన్చార్జీలుగా ఉన్నవారు దాదాపు అభ్యర్థులేనని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
ఎక్కడ అభ్యర్థుల ఖరారు అయిందో అక్కడ సభలు నిర్వహనకు సంబంధించి ప్లాన్ చేసుకున్నట్లు తెలుస్తోంది. రాబోయే రోజుల్లో చంద్రబాబు చాలా నియోజకవర్గాలలో పాల్గొనున్నారు. గుడివాడకు వెనిగళ్ళ రామ్మోహన్, గంగాధర నెల్లూరుకు డాక్టర్ థామస్, మండపేటకు వేగుళ్ళ జోగేశ్వరరావు, అరకు దున్నుదొర, కోవూరు పోలంరెడ్డి దినేష్ రెడ్డి, ఉరవకొండకు పయ్యావుల కేశవ్, పీలేరుకు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి, గోపాలపురం నియోజకవర్గ మద్దిపాటి వెంకట రాజు, కమలాపురం నియోజకవర్గానికి పుత్తా నరసింహారెడ్డి , పత్తికొండకు కేఈ శ్యాంబాబు, మాడుగులకు పివిజి కుమార్, పొన్నూరుకు ధూళిపాళ్ల నరేంద్ర కుమార్, ఉంగటూరు గన్ని వీరాంజనేయులు, చీరాలకు కొండయ్య యాదవ్ ఇన్చార్జులుగా ఉన్నారు. ఈ నియోజకవర్గాల్లోనే చంద్రబాబు రా కదలిరా సభలు జరగనున్నాయి. వీరంతా దాదాపు అభ్యర్థులేనని పార్టీ వర్గాలు అంటున్నాయి. వీరి పేర్లతోనే ఫస్ట్ జాబితా టీడీపీ విడుదల చేస్తుందని ప్రచారం జరుగుతుంది.
మేమంతా సిద్ధం బస్సు యాత్రలో ఉన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై ఒక ఆగంతకుడు హత్యాయత్నానికి తెగబడ్డాడు. యాత్రలో భాగంగా శనివారం…
The wheels of progress are turning as Tesla, the global electric vehicle (EV) major, considers Andhra…
సొంత ఇల్లు నాకల.. ఈ రోజుతో నెరవేరిందంటూ కళ్లమ్మట వెలుగులతో, గుండె నిండా సంతోషంతో మాట్లాడిన గీతాంజలి అనే ఈ…
ఏ పార్టీలోనైనా పదవులు, ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్స్ ఇవ్వకపోతే పార్టీకి రాజీనామాలు చేసి వెళ్ళిపోతుంటారు. కానీ వైసీపిలో పదవులు,…
జనసేన అధినేత పవన్ కల్యాణ్ విశాఖ పర్యటన ఖరారు అయింది. రెండు రోజుల (ఆదివారం, సోమవారం) పాటు పవన్ విశాఖలో…
ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులు తమ ఉద్యమ భవిష్యత్ కార్యాచరణను ప్రకటించిన వేళ.. వారికి తీపి కబురు అందింది. వారి డిమాండ్లపై…