Categories: Political Updates

పల్నాడు జిల్లా నరసరావుపేట లోక్ సభ ఇంచార్జి మార్పుపై కొనసాగుతున్న పంచాయితీ

పల్నాడు జిల్లా నరసరావుపేట లోక్ సభ ఇంచార్జి మార్పుపై పంచాయితీ కొనసాగుతోంది. ఇక్కడ సిట్టింగ్ ఎంపీగా లావు శ్రీకృష్ణదేవరాయులు ఉన్నారు.

అయితే ఈ పార్లమెంటు ఇంచార్జిని మార్చాలని సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు లావు శ్రీకృష్ణదేవరాయులతో మాట్లాడారు. నరసరావుపేట లోక్‌సభ నుంచి కాకుండా గుంటూరు నుంచి పోటీ చేయాలని సూచించారు. ఇందుకు లావు శ్రీకృష్ణదేవరాయులు ససేమీరా అంటున్నారు. నరసరావుపేట నుంచి ఎంపీగానే తనకు అవకాశం ఇవ్వాలని సీఎం జగన్‌కే తెలిపారు. కానీ సీఎం జగన్ మాత్రం నరసరావుపే ఎంపీ బరిలో బీసీ నేతను దించితే గెలిచే అవకాశాలు ఉంటాయని భావిస్తున్నారు. ఈ మేరకు ఆ స్థానానికి బీసీ నేత నాగార్జున యాదవ్ నీ పరిశీలించినప్పట్టికి ఆ నిర్ణయాన్ని కూడా వెనక్కు తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఆ స్థానంలో మరో బలమైన బీసీ నేతను పోటీకి దింపాలని చూస్తున్నారు.

మరోవైపు పల్నాడు జిల్లా ఎమ్మెల్యేలు మాత్రం నరసరావుపేట లోక్‌సభ నుంచి లావు శ్రీకృష్ణదేవరాయులనే కొనసాగించాలని కోరుతున్నారు. కొత్త ఇంచార్జిని నియమిస్తే నాలుగైదు నియోజకవర్గాల్లో పరిస్థితులు మారతాయని, తద్వారా తమకు ఇబ్బందులు తప్పవని చెబుతున్నారు. గురజాల, నరసరావుపేట, పెద్దకూర పాడు, మాచర్లలో నాయకులు, కార్యకర్తలతో లావు శ్రీకృష్ణదేవరాయులకు మంచి సంబంధాలు ఉండటంతో పలు సేవా కార్యక్రమాలు చేయడంతో మరోసారి గెలిచే అవకాశం ఉందని అంటున్నారు. గుంటూరులో పోటీ చేస్తే ఓటమి తప్పదనే భావనను వ్యక్తం చేశారు. ఇక ఈ విషయాన్ని ఇప్పటికే సీఎంవోకు కూడా చెప్పారు. అయితే గుంటూరు నుంచి లావును బరిలో దించాలని అధిష్టానం స్ట్రాంగ్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.ఇందుకు ఆయన అనాసక్తి చూపుతున్నారు. మరి ఎమ్మెల్యేల ప్రతిపాదనలతో సీఎం జగన్ నరసరావుపేట విషయంలో వెనక్కి తగ్గుతారేమో చూడాలి.

అలానే పల్నాడు జిల్లాలో మరో ఇద్దరు వైసీపీ నేతలు కూడా అధిష్టానం పై గురుగా ఉన్నట్లుగా తెలుస్తుంది.

ఈనెల 18వ తారీకు దీని మీద ఓ క్లారిటీ వచ్చిందని సమాచారం నిర్ణయం అనేది ఎంపీ శ్రీకృష్ణ తీసుకుంటారా మరి అధిష్టానం తీసుకుంటుంద వేసి చూడాలి.

Recent Posts

సీఎం జగన్‌పై ఆగంతకుడి దాడి!

మేమంతా సిద్ధం బస్సు యాత్రలో ఉన్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై ఒక ఆగంతకుడు హత్యాయత్నానికి తెగబడ్డాడు. యాత్రలో భాగంగా శనివారం…

7 months ago

Exciting News! Tesla’s Green Journey to Andhra Pradesh!

The wheels of progress are turning as Tesla, the global electric vehicle (EV) major, considers Andhra…

7 months ago

Geetanjali: జగనన్న ఇల్లు ఇచ్చాడని సంతోషంగా చెప్పిన ఈ మహిళ చనిపోయిందా.. అసలేం జరిగింది?

సొంత ఇల్లు నాకల.. ఈ రోజుతో నెరవేరిందంటూ కళ్లమ్మట వెలుగులతో, గుండె నిండా సంతోషంతో మాట్లాడిన గీతాంజలి అనే ఈ…

8 months ago

టికెట్స్ పొందినా వాళ్ళు వైసీపికి రాజీనామాలు…దేనికి సంకేతం?

ఏ పార్టీలోనైనా పదవులు, ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్స్ ఇవ్వకపోతే పార్టీకి రాజీనామాలు చేసి వెళ్ళిపోతుంటారు. కానీ వైసీపిలో పదవులు,…

9 months ago

విశాఖలో జనసేనాని రెండు రోజుల పర్యటన

జనసేన అధినేత పవన్ కల్యాణ్ విశాఖ పర్యటన ఖరారు అయింది. రెండు రోజుల (ఆదివారం, సోమవారం) పాటు పవన్ విశాఖలో…

9 months ago

ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్

ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులు తమ ఉద్యమ భవిష్యత్ కార్యాచరణను ప్రకటించిన వేళ.. వారికి తీపి కబురు అందింది. వారి డిమాండ్లపై…

9 months ago